NTV Telugu Site icon

Viral Video: నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రి అప్పలరాజు

Minister Appalaraju

Minister Appalaraju

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు పలువురు డ్యాన్స్ వేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నాటు నాటు అంటూ సాగే పాటకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు డ్యాన్స్ చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన ఓ బాలుడితో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్‌లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మంత్రి అప్పలరాజు టక్ చేసుకుని జీన్స్ ప్యాంట్ ధరించి కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తరహాలో మంత్రి అప్పలరాజు, సదరు బాలుడు కలిసి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఆర్.ఆర్.ఆర్ మూవీ కలెక్షన్‌లను భారత ఎకానమీతో పోల్చడం హాట్ టాపిక్‌గా మారింది. అటు నాటు నాటు పాట చాలా మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటకు దిల్ రాజు ఇచ్చిన పార్టీలో దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి కలిసి స్టెప్పులు వేయడం కూడా వైరల్‌ అవుతోంది. మరోవైపు ఈ సినిమాలోని ఒరిజినల్ సౌండ్ వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తాజాగా వెల్లడించడం సంగీత అభిమానులను సంతోషపరుస్తోంది.