ఇండియా టెక్నాలజీ రంగంలో ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నది. ప్రతి మనిషికి కూడు, గూడు, బట్ట అవసరం. తినేందుకు తిండిని, కట్టుకునేందుకు బట్టను సంపాదించుకుంటున్నా, నివశించేందుకు గూడును మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు. సొంత ఇల్లును నిర్మించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిణామాల కారణంగా సొంతిల్లు కట్టుకోవడం ఒక కలగానే మిగిలిపోయింది. అయితే, ప్రస్తుతం 3డీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో విదేశాల్లో తక్కువ ధరతో ఎక్కువ మొత్తంలో ఇళ్లను నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఇండియాలోనూ 3డీ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read: జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం
ఐఐటి మద్రాస్ సహకారంతో స్టార్టప్ సంస్థ త్వాస్తా కంపెనీ దేశంలో తొలి 3డీ ఇంటిని నిర్మించింది. ఈ ఇంటి నిర్మాణానికి కేవలం రూ.5.5 లక్షల రూపాయల ఖర్చు అయినట్టు కంపెనీ తెలియజేసింది. ఐఐటీ మద్రాస్ సంస్థ నిర్మించిన తొలి 3డీ ఇంటిపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 3డీ ప్రింటెడ్ గృహనిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను తాను గమనిస్తున్నానని, భారత్ లో తొలి 3డీ హౌస్ నిర్మాణం జరగడం గొప్పవిషయమని అన్నారు. తప్పకుండా 3డీ హౌసింగ్ టెక్నాలజీ దేశానికి ఉపయోగపడుతుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.