దేశంలో సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లలో ఒకరు ఆనంద్ మహీంద్రా. కార్ల కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బిజినెస్ తో పాటు సోషల్ మీడియాలో సైతం ఆనంద్ మహీంద్రా నిత్యం బిజీగా ఉంటారు. కొత్త టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిత్యం ముందు వరసలో ఉంటాడు. ఇక, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి తన కుమారుడి కోసం పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ కారు చూసేందుకు చిన్నగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో, దానిపై ఆనంద్ మహీంద్రా మనసుపారేసుకున్నాడు. వెంటనే సామాన్యుడికి అదిరిపోయే డీల్‌ను ఇచ్చాడు.
Read: ఆకట్టుకుంటున్న ఓలా ఈవీ కారు…
పాత కారుకు బహుమతిగా మహీంద్రా బొలెరో కొత్త వాహనం ఇస్తానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, అయితే, మొదట్లో సామాన్యుడు దానికి ఒప్పుకోలేదు. ఎలాగైతేనేం చివరకు సామాన్యుడు ఆనంద్ మహీంద్రా డీల్‌కు ఓకే చేయడంతో పాత వాహనం తీసుకొని దాని స్థానంలో కొత్త బొలెరో వాహనాన్ని అందించారు. సామాన్యుడి పాత వాహనం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చేరిందని, అక్కడ దానిపై తమ రీసెర్చ్ బృందం తప్పకుండా రీసెర్చ్ చేస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.