Site icon NTV Telugu

Viral: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

Sam

Sam

ఈ మధ్య కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తుంటే పరమ చెత్తగా… అసహ్యంగా ఉంటున్నాయి. చాలా దారుణమైన నీచమైన పనులు చేస్తూ.. అడ్డంగా బుక్కైపోతున్నారు. గతంలో మెట్రోలో ఓ యువకుడు మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ యువకుడు మెట్రోలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం ఎక్కిన వ్యక్తి చక్కగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయకుండా ఎయిర్ హోస్టెస్ మీద కాన్సంట్రేట్ చేశాడు. అందంగా ఉన్న ఆమెను వెనుక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే రికార్డింగ్ కూడా ఆపేశాడు. దీంతో అతడు చేస్తున్న పనిని తోటి ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యక్తికి అల్రెడీ నలుగురు భార్యలతో పాటు 28 మంది పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యకరంగా చిత్రీకరించడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు…ఇలాంటి చెత్త పనులు మానుకోవాలని సూచిస్తున్నారు

Exit mobile version