Site icon NTV Telugu

ఆ ఇంట్లో ఎవ‌రు నివ‌శించినా వారికి దురదృష్ట‌మే… అదృష్టం ఏంటంటే…

కొన్ని ఇల్లు భ‌లే క‌లిసి వ‌స్తుంటాయి.  కొన్ని ఇల్లు మాత్రం అస్స‌లు ఎవ‌రికీ క‌లిసిరావు. ఇంటిని ఇష్ట‌ప‌డి క‌ట్టుకున్నా, కొనుక్కున్నా ఆ ఇంట్లో నివ‌శించే వారికి ఎప్పుడూ తెలియ‌ని ఇబ్బందులు ఎదురౌతుంటాయి.  అప్పులు, జ‌బ్బుల‌తో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.  శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్న‌ది.  సుమారు 122 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్లు, ల‌గ్జ‌రీ ఇళ్లు ఉన్నాయి.  కానీ, ఆ ఇల్లు మాత్రం బ‌య‌ట పాడుబ‌డిన విధంగా ఉంటుంది.  అందులో నివ‌శించేందుకు ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేదు.  దీనికి కార‌ణం లేక‌పోలేదు. రెండో ప్ర‌పంచ యుద్దం త‌రువాత ఆ ఇంట్లో కొంత‌మంది నివ‌శించారు.  అందులో ఉన్న వ్య‌క్తులు ఎప్పుడో ఏవోక ఇబ్బందులతో బాధ‌ప‌డ్డార‌ట‌.

Read: మీరు దుబాయ్ వెళ్తున్నారా… అయితే త‌ప్ప‌కుండా ఈ ఫుడ్స్‌ను టేస్ట్ చేయండి…

ఆ త‌రువాత కొంద‌రు ఆ ఇంట్లో ఉన్నా వారికి కూడా అలాంటి అనుభ‌వాలే ఎదురుకావ‌డంతో ఆ ఇంటివైపు చూడాలంటే జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు.  బ‌య‌ట‌కుపాడుబ‌డిన‌ట్టు క‌నిపించినా లోప‌ల మాత్రం అద్భుతంగా అంద‌మైన ఫ‌ర్నీచ‌ర్‌తో ఉన్న‌ది.  ఇక్క‌డ అదృష్టం ఏమిటంటే ప్ర‌స్తుతం ఆ ఇంటికి ఒన‌ర్‌గా ఉన్న టాడ్ వెలీ అనే వ్య‌క్తి దానిని వేలం వేశాడు.  ఆరు ల‌క్ష‌ల డాల‌ర్ల వేలంతో ప్రారంభం కాగా, చివ‌ర‌కు ఈ ఇంటిని ఓ వ్య‌క్తి రూ. 14 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నాడు.  ఈ స్థాయిలో అమ్ముడుపోతుంద‌ని టాడ వెలీ ఊహించ‌లేద‌ట‌.  

Exit mobile version