NTV Telugu Site icon

వైరల్ వీడియో: కొవిడ్‌ మృతదేహాన్ని నదిలో పడేశారు

ఇటీవలే నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌ బలరాంపూర్‌ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్‌ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరోవ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.