ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో బుల్ షార్క్ ఒక మత్స్యకారుడి చేతిని కొరికి, అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది. పడవలో చేపలు పట్టడానికి వెళ్లిన అతను చేతులు కడుక్కోవడానికి పడవలో నుంచి నీళ్లలో చేతులు పెట్టి కడుక్కుంటున్నాడు. ఆ టైంలో ఈ దాడి జరిగింది.
Read Also: Sajjala Ramakrishnudu: 175కి 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలి.. టెలి కాన్ఫరెన్స్‌లో సజ్జల
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను మైఖేల్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. సదరు మత్య్సకారుడు బోటులోనే ఉన్న వ్యక్తి ఈ వీడియోను తీశాడు.
ఎలర్జన్ అనే బాధితుడు నీటిలో చేతులు కడుక్కుంటున్నప్పుడు.. అదే సమయంలో ఒక పెద్ద బుల్ షార్క్ హఠాత్తుగా వచ్చి అతని చేతిని కరిచింది. మనిషి శరీర వాసన, రక్తం లాంటి వల్ల సొరచేపలు ఆకర్షించబడతాయి. అయితే, ఈ ఘటన సమయంలో అలాంటివేవీ లేకపోయినా దాడి జరిగింది. అందుకే పడవల్లో ప్రయాణం చేసేప్పుడు చేతులను నీటి నుంచి దూరంగా ఉంచుకోవాలి.
Read Also: Devara: ఇండియాలో ల్యాండ్ అయిన దేవర.. ఇక మొదలెట్టడమే
ఈ సంఘటన తర్వాత, బాధితుడిని జాక్సన్ సౌత్ మెడికల్ సెంటర్‌కు విమానంలో తరలించారు. పార్క్ రేంజర్లు, అతనికి చికిత్స చేసిన డాక్టర్లు అతని గాయాలు షార్క్ కాటుకు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే, అతని చేతికి గాయం ఏ మేరకు అయ్యింది. ప్రస్తుతం అతనిపరిస్థితి ఏంటి అనే విషయాల వివరాలు వెల్లడించలేదు.
Read Also: Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే
ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో షార్క్ ఇలా దాడి చేయడం చాలా అసాధారణం అయితే, పార్క్ లో వన్యప్రాణుల దగ్గరగా వెళ్లొద్దని.. ఆ సమయంలో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని చెబుతామని నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది. పర్యాటకులు ఎలిగేటర్లు, మొసళ్ళు, విషపూరిత పాములు, ఇతర మాంసాహార జంతవులు ఆ పార్కులో ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.