NTV Telugu Site icon

Writeoff Loans: రుణాలను రైటాఫ్‌ చేస్తే చెల్లించాల్సిన పనిలేదా? నిర్మలాసీతారామన్‌ ఏమంటున్నారంటే..

Writeoff Loans

Writeoff Loans

Writeoff Loans: లోన్లు తీసుకున్నవాళ్లలో ప్రతిఒక్కరూ వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీ లేదు. దీంతో.. వివిధ కారణాల వల్ల కొన్ని రుణాలు మొండి బకాయిలుగా మారుతుంటాయి. నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని సాంకేతికంగా రద్దు చేస్తుంటారు. అంటే.. టెక్నికల్‌గా.. రైటాఫ్‌ చేస్తారు. ఫలితంగా.. కొందరు.. ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు.

బ్యాంకులు, ప్రభుత్వాలు.. ఆ లోన్లను మాఫీ చేశాయేమోనని భ్రమపడతారు. ఈ నేపథ్యంలో.. రుణాల రైటాఫ్‌కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రీసెంట్‌గా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. లోన్లు నిరర్థక ఆస్తులుగా మారిపోయి నాలుగేళ్లు పూర్తయ్యాక వాటికి పూర్తిగా కేటాయింపులు జరుపుతారు.

read more: IMF bailout for Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కనున్న ద్వీపదేశం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్‌లైన్స్‌ మరియు బ్యాంకుల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల అంగీకారం ప్రకారం.. రైటాఫ్‌ పేరుతో.. ఆ రుణాలను బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తారు. ఈ పనిని బ్యాంకులు చేస్తాయి. బ్యాలెన్స్‌ షీట్లను ఎప్పటికప్పుడు పటిష్టపరచుకునే క్రమంలో.. రైటాఫ్‌ అయిన లోన్ల ప్రభావం గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తుంటాయి.

వాటిని తిరిగి వసూలు చేయటం ఎట్లా అని ఆలోచిస్తాయి. ఈ మేరకు పలు పద్ధతుల్లో ముందుకెళుతుంటాయి. సివిల్‌ కోర్టులను ఆశ్రయించటం.. ట్రిబ్యునల్స్‌లో వ్యాజ్యాలను దాఖలుచేయటం వంటి చర్యలను చేపడతాయి. సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రస్ట్‌ యాక్ట్‌ 2002ను అనుసరించి కూడా ప్రయత్నాలను కొనసాగిస్తాయి.

అంటే.. రుణాలను రైటాఫ్‌ చేసినంత మాత్రాన వాటిని తిరిగి చెల్లించాల్సిన పనిలేదనుకోవటం తప్పన్నమాట. కాబట్టి.. లోన్లు తీసుకున్నవాళ్లు వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తేనే రిలీఫ్‌ పొందుతారు. అంతేతప్ప.. మాఫీ అవుతాయనో.. రద్దవుతాయనో.. వేచిచూడటం వేస్ట్‌. పైగా.. కేసుల్లో ఇరుక్కొని శిక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇదిలా ఉండగా.. గతేడాది మార్చి నాటికి.. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన రైటాఫ్‌ రుణాలను వసూలు చేశాయి.

దీంతో.. నికరంగా మిగిలిన నిరర్థక ఆస్తుల విలువ 6 పాయింట్‌ మూడు ఒకటి లక్షల కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మొత్తం రైటాఫ్‌ రుణాల విలువ 7 పాయింట్‌ మూడు నాలుగు లక్ష కోట్ల రూపాయలు కాగా.. ఇందులో.. వసూలు చేసిన రైటాఫ్‌ రుణాల వాటా 14 శాతమని పేర్కొన్నారు.