Wipro Layoffs: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో.. 450 మంది ఎంట్రీ లెవల్ ఎంప్లాయీస్‌ని ఉద్యోగాల నుంచి తొలగించింది. శిక్షణ ఇచ్చినప్పటికీ పనితీరులో మెరుగుదల లేకపోవటంతో వాళ్లను ఇంటికి పంపక తప్పలేదని పేర్కొంది. స్టాఫ్ పెర్ఫార్మెన్స్ విషయంలో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని, అప్పగించిన పనిని ఏవిధంగా చేస్తున్నారనే విషయంలో ఫ్రెషర్స్ నుంచి ఓ స్థాయి సామర్థ్యాన్ని ఆశిస్తామని కంపెనీ తెలిపింది.
Backward China: అర్ధ శతాబ్ధంలో 2వ అత్యల్ప వృద్ధి రేటు
స్టాండర్డ్స్ లేనివారిని కొలువులో కొనసాగించటం కష్టమని తేల్చిచెప్పింది. పనితీరు మదింపులో భాగంగా.. సంస్థ బిజినెస్ లక్ష్యాలకు మరియు క్లైంట్ల అవసరాలకు తగ్గట్లు ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించేందుకు పలు అసెస్‌మెంట్లను నిర్వహిస్తామని వెల్లడించింది. పెర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోతే వాళ్లకు మెంటారింగ్ నిర్వహిస్తామని, రీట్రైనింగ్ ఇస్తామని, కొంత మందిని కంపెనీ నుంచి పంపించేయటం కూడా జరుగుతుందని విప్రో తెలిపింది.
పని బాగా లేని ఎంట్రీ లెవల్ ఉద్యోగులను కంటిన్యూ చేసే అవకాశం లేనందున వాళ్ల శిక్షణ కోసం సంస్థ చేసిన ఖర్చు ఒక్కొక్కరిపై 75 వేల రూపాయలని, వాటిని ఆయా అభ్యర్థులు కంపెనీకి తిరిగి చెల్లించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని విప్రో ఖండించింది. ట్రైనింగ్ కోసం పెట్టిన వ్యయాన్ని మాఫీ చేయనున్నట్లు టెర్మినేషన్ లెటర్లలో పొందుపరిచినట్లు తెలిసింది.
డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విప్రో.. ఊహించినదానికి కన్నా 2 పాయింట్ 8 శాతం నికర లాభం నమోదుచేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రస్తుత త్రైమాసికంలో కీలకమైన ఐటీ సర్వీసుల వ్యాపారం తగ్గొచ్చని అంచనా వేసింది.