Site icon NTV Telugu

Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే..

Untitled Design (11)

Untitled Design (11)

అడవిలో రెండు సమ ఉజ్జీలు ఆహారం కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కదా.. సింహాలు, చిరుతపులులు, పులులు వంటివి తరచూ ఆహారం కోసం, ఉనికి చాడుకోవడం కోసం ఒక దానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. క్రూర మృగాల భీకర పోరాటాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది.

Read Also: Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే..

ఓ అడవిలో ఓ చిరుతపులి.. సింహాం మధ్య ఆహారం కోసం భీకర యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది. సింహాలు, చిరుతపులులు వంటి పెద్ద పులులు తరచుగా ఒకదానితో ఒకటి తమ ఉనికి కోసం, ఆహారం కోసం పోరాడుతాయి. సింహాన్ని అడవి రాజుగా పరిగణించినప్పటికీ, చిరుతపులి తన చురుకుదనం, వేగం కారణంగా శక్తివంతమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. చిరుత పులి, సింహాల మధ్య పోరాటం ఎంతో భీకరంగా జరిగింది. ఇలా పోరాడుతూ అక్కడే ఉన్న ఓ చెట్టు కొస వరకు వెళ్లాయి. చెట్టు కొమ్మ విరిగి కింద పడడంతో చిరుత పులి అక్కడి నుంచి పారిపోయింది. చివరికి అడవికి రాజైన సింహాం విజేతగా నిలిచింది. అయితే ఈ క్రూర మృగాల భీకర పోరాటాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయిపోయింది.

Exit mobile version