WE HUB: ‘వి హబ్’ అనేది టెక్నికల్‌గా ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ కావొచ్చు. కానీ ఈ సంస్థ అందిస్తున్న అసమాన సేవలను బట్టి దాన్ని ఉమెన్ ఎంపవర్‌మెంట్ హబ్ అని కూడా అనొచ్చు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ‘వి హబ్’ తన వంతుగా శాయశక్తులా పాటుపడుతోంది. వ్యాపారానికి ముఖ్యంగా డబ్బు కావాలి. కానీ అంతకన్నా ముందు అసలు బిజినెస్ చేయాలనే ఆలోచన, ప్రణాళిక ఉండాలి. అవి ఉంటే పెట్టుబడి దానంతట అదే వస్తుందని ‘వి హబ్’ సీఈఓ దీప్తి రావుల అన్నారు.
బిజినెస్ అంటే మేకింగ్ మనీ, ప్రాఫిట్స్, క్రియేటింగ్ జాబ్స్ అని చెప్పారు. ఎంతో మంది మహిళలు ‘వి హబ్’ ద్వారా వ్యాపారవేత్తలుగా కెరీర్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నారని, తద్వారా రోల్ మోడల్స్‌గా నిలిచారని మెచ్చుకున్నారు. అసంఖ్యాకమైన ఉమెన్ సక్సెస్ స్టోరీలకు ‘వి హబ్’ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని సగర్వంగా ప్రకటించారు. ‘ఎన్-బిజినెస్ ఇన్‌సైడర్’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆమె ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఆ వీడియో మీకోసం..