NTV Telugu Site icon

Vikrant Varshney Exclusive Interview: లైఫ్‌లో సక్సెస్‌ అవ్వాలంటే.. కీ ఇండికేటర్స్‌పై ఫోకస్‌ పెట్టాలి: ‘సక్సీడ్‌ ఇండోవేషన్‌’ విక్రాంత్ వర్ష్నీ

Vikrant Varshney Exclusive Interview

Vikrant Varshney Exclusive Interview

Vikrant Varshney Exclusive Interview: జీవితంలో విజయం సాధించాలంటే కీలకమైన అంశాలపై దృష్టిపెట్టాలని సక్సీడ్‌ ఇండోవేషన్‌ కోఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ విక్రాంత్‌ వర్ష్నీ సూచించారు. ఎన్‌-బిజినెస్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీంతో తమ సక్సీడ్‌ వెంచర్స్‌ ఏవిధంగా సక్సెస్‌ సాధించిందో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. కార్పొరేట్‌ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశాను. సొసైటీకి తిరిగివ్వాలనే లక్ష్యంతో బయటికి వచ్చాను.

కార్పొరేట్‌ వరల్డ్‌ నుంచి బయటికి వస్తేనే మరింత బాగా సమాజానికి ఏదైనా చేయగలను అనిపించింది. అందుకు ఆ లైఫ్‌ను విడిచి పెట్టి ఫ్రెండ్స్‌తో కలిసి 2016లో ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశాను. తద్వారా స్టార్టప్‌లకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళుతున్నాం. ఇప్పుడు మా వద్ద వంద కోట్ల రూపాయల వరకు కార్పస్‌ ఫండ్‌ ఉంది. సక్సీడ్‌ అనే పేరులో చాలా అర్థాలు ఉన్నాయి. సక్సీడ్‌ అనగానే స్టార్టప్‌ అనే ఫీలింగ్ కలగాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టాం.

Sucలో ఎస్‌ అంటే స్టార్టప్‌ అని, Seed అంటే సీడ్‌ లెవల్‌ అని చెప్పుకోవచ్చు. సక్సీడ్‌ అంటే అందరం కలిసి విజయం సాధించటం అని కూడా పేర్కొనొచ్చు. సక్సెస్‌ పదానికి సక్సీడ్‌ను ఉదాహరణగా పలువురు ప్రస్తావిస్తుండటం మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రారంభంలో మా దగ్గర మూడు ఇన్వెస్ట్‌మెంట్‌ కాంపొనెంట్స్‌ ఉండేవి. 2017లో ఐఐఐటీ కూడా మమ్మల్ని ఆహ్వానించింది. ఎర్లీ స్టేజ్‌ ఫండ్‌ను ఏర్పాటుచేయాలంటూ రిక్వెస్ట్‌ చేసింది. దీంతో ట్రిపుల్‌ ఐటీ సీడ్‌ ఫండ్‌ను ఏర్పాటుచేశాం.

ఎర్లీ స్టే్‌జ్‌ ఫండ్‌ను ఏర్పాటుచేయటం రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే.. రిటర్న్స్‌ రావటానికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ధైర్యంగా పెట్టుబడి పెట్టాం. ఆ తర్వాత 75 స్టార్టప్‌లకు ఫండింగ్‌ చేయగలిగాం. ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో 65 స్టార్టప్‌ల వరకు ఉన్నాయి. సోషల్‌ మీడియాతోపాటు మా ఇన్వెస్ట్‌మెంట్స్‌, బ్రాండింగ్‌ తదితర వివరాలను పరిశీలించి ఫండింగ్‌ కోసం చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. తొలుత 15 శాతం ఫండ్స్‌ని ఫార్మాటివ్‌ మోడ్‌లో ఇస్తాం.

తర్వాత ఆ స్టార్టప్‌ ఏవిధంగా గ్రోత్‌ అవుతోందో పరిశీలిస్తాం. వాళ్లతో కలిసి పనిచేస్తాం. వాళ్లు అభివృద్ధి చెందేందుకు సాయపడతాం. స్టార్టప్‌ ఫౌండర్లు బాగా చేస్తున్నారనిపిస్తే అప్పుడు ఫాలోఆన్‌రౌండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేస్తాం. సక్సీడ్‌తో కలిసి జర్నీ చేసేవారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కమ్యూనిటీల ఏర్పాటులో తెలంగాణ మరియు హైదరాబాద్‌ చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తు్న్నాయి. ఇంత బాగా ఏ రాష్ట్రంలోనూ లేదు.

ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఇంకుబేటర్స్‌, గవర్నమెంట్‌, స్టార్టప్స్‌తోపాటు హైసియా వంటి ఇతర సంస్థలు చాలా క్రియాశీలకంగా ఉన్నాయి. ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ లీడర్‌షిప్‌లో, జయేశ్‌ రంజన్‌ సహకారంతో కమ్యూనిటీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. విక్రాంత్‌ వర్ష్నీ చెప్పిన విలువైన విషయాలను పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు ఆయన ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఫుల్‌ ఎపిసోడ్‌ వీడియో ఈ కిందనే ఉందని గమనించగలరు.