Top Five Luxury Brands in the World: బ్రాండ్ అంటే ఒక పేరు మాత్రమే కాదు. ఒక పదం, డిజైన్, సింబల్ లేదా మరేదైనా ఫీచర్. వస్తువులను లేదా సర్వీసులను తెలియజేస్తుంది. వివిధ కంపెనీలు విక్రయించే వస్తువులు లేదా సర్వీసులు ఒక్కటైనప్పుడు వాటిని వేరు చేసి చూపేది, వేర్వేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేది బ్రాండ్సే. వీటిని బిజినెస్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌లలో వాడతారు. మార్కెట్ విషయానికి వస్తే బ్రాండ్లు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి.. మాస్ బ్రాండ్స్. రెండు.. లగ్జరీ బ్రాండ్స్. ప్రపంచంలోని అత్యధిక బ్రాండ్లు మాస్ మార్కెట్ కేటగిరీ కిందికే వస్తాయి. ఎందుకంటే అవి యావరేజ్, రెగ్యులర్ కొనుగోలుదారులకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి.
కానీ.. లగ్జరీ బ్రాండ్స్ మాత్రం రిచ్ పీపుల్‌ని మాత్రమే టార్గెట్ చేసుకుంటాయి. ఈ ప్రొడక్టులు ప్రెస్టేజియస్‌గా, హైక్వాలిటీతో, లిమిటెడ్ సంఖ్యలో ఉంటాయి. రెగ్యులర్ పీపుల్‌కి సహజంగా అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో టాప్-5 లగ్జరీ బ్రాండ్ల లిస్టును పరిశీలిద్దాం. బ్రాండ్ల పేరును మాత్రమే కాకుండా ఆయా కంపెనీల సీఈఓలు, వాటిని స్థాపించిన సంవత్సరం, హెడ్ క్వార్టర్స్, ప్రొడక్ట్స్, రెవెన్యూ వంటి వివరాలను కూడా పరిశీలిద్దాం. ఈ మేరకు.. ‘Top-5 in the World’ పేరుతో ‘ఎన్-బిజినెస్’ ప్రతివారం రూపొందిస్తున్న షార్ట్స్ పైన క్లిక్ చేస్తే ఆ డిటెయిల్స్ ఇట్టే ప్రత్యక్షమవుతాయి. మరెందుకు ఆలస్యం? చూసేద్దామా?. సంబంధిత లింక్.. పైనే ఉందని గమనించగలరు.