To Get Profits in Stock Markets: స్టాక్ మార్కెట్లలో లాభాలను ఆర్జించాలంటే ఏవి ముఖ్యం?. స్కిల్సా?, నాలెడ్జా?, లేక ఈ రెండూ కాకుండా మరేదైనా ఉందా? అంటే ‘ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు. అదే.. ట్రేడింగ్ సైకాలజీ. అసలు ఈ టాపిక్ ఏంటి అంటే.. స్టాక్ మార్కెట్‌లో ఎలా ట్రేడింగ్ చేయాలి?, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి? వంటి ప్రశ్నలకు ఈ కాన్సెప్టులో సమాధానాలను తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ బిజినెస్ విషయానికి వస్తే రెండింటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి.. స్టాక్ మార్కెట్. రెండు.. ఇన్వెస్టర్స్.
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ వండర్‌ఫుల్, గుడ్ బిజినెస్ ఆప్షనే. అందులో ఎలాంటి డౌటూ లేదు. ఇక, ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే.. వాళ్లు ఎలాంటి ఆలోచనలతో, అంచనాలతో, ఆశలతో ఈ వ్యాపారం చేస్తున్నారనేది విశ్లేషించాలి. స్టాక్ మార్కెట్ అనే కాదు. ఏ బిజినెస్ అయినా.. అది చేసేవాళ్లను బట్టి లాభాలు, గ్రోత్ ఆధారపడి ఉంటాయి. వ్యాపార నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉన్నప్పటికీ చాలా మంది స్టాక్ మార్కెట్లో నష్టాలను చవిచూస్తుండటానికి కారణం వాళ్లకు మంచి ట్రేడింగ్ సైకాలజీ, క్రమశిక్షణ లేకపోవటం. ట్రేడింగ్ సైకాలజీలో ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
స్టాక్ మార్కెట్లలో లాభాలను పొందాలనుకునేవారు, ఇలాంటి మరిన్ని విలువైన, ఆసక్తికరమైన అనాలసిస్‌ను కోరుకునేవారు ‘ఎన్-బిజినెస్’ అందిస్తున్న ఈ ‘ఫిన్-టాక్’ వీడియోను చూస్తే సరిపోతుంది. స్టాక్ మార్కెట్లలో ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ‘వెల్త్ ట్రీ’ గ్రూప్ ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ఈ వీడియోలో చక్కని సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అందించారు. వీటితోపాటు సంబంధిత సందేహాలు ఉన్నవారు, పూర్తి వివరాలు కావాలనుకునేవారు ఆయన్ని ఫోన్‌లో గానీ ఇ-మెయిల్ ద్వారా గానీ సంప్రదించొచ్చు. ఆ డిటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయని వ్యూయర్స్ గమనించగలరు.