NTV Telugu Site icon

Tata-Bisleri: బిస్లెరీ విషయంలో టాటా బొక్క బోర్లా ఖాయం

Tata Bisleri

Tata Bisleri

Tata-Bisleri: మంచి నీళ్ల సీసాకు మారుపేరుగా నిలిచిన బిస్లెరీ కంపెనీ.. అమ్మకానికి వచ్చిందనే టాక్ ఇటీవల వినిపించింది. ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి చివరికి సంస్థ అధిపతి రమేష్ చౌహాన్ కి చేరటంతో ఆయన స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఖండించారు. అయితే.. ఇది పెద్ద విషయం కాదు. అసలు.. బిస్లెరీని కొనుగోలు చేసే కంపెనీ ఏది, ఎంత చెల్లించి సొంతం చేసుకోబోతోంది అనేవి హాట్ టాపిక్ అయ్యాయి. టాటా కంపెనీ 7 వేల కోట్ల రూపాయలు పెట్టి బిస్లెరీని కొంటోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిస్లెరీకి అంత అవసరమా అంటున్నారు.

రెండేళ్ల కిందట అంటే 2020లో కేవలం వంద కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించిన బిస్లెరీకి టాటా 7 వేల కోట్లు చెల్లించనుందనే వార్తల పట్ల ఎంట్రప్రెన్యూర్ సేజల్ సుద్ ‘ట్విట్టర్’లో విస్మయం వెలిబుచ్చారు. ‘‘అసలు.. టాటాకి బిస్లెరీ అవసరమా’’ అన్నారు. ఇంతకీ.. బిస్లెరీ ఎందుకు అమ్మకానికొచ్చింది అని సందేహించారు. దీనిపై మీ స్పందనేంటని తోటి నెటిజన్లను అడిగారు. దీనికి ఒక్కొక్కళ్లు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు.

Show comments