T-hub: టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T-hub: టీ-హబ్ అంటే టెక్నాలజీ హబ్. కానీ.. చాలా మంది తెలంగాణ హబ్ అనుకుంటారు. ఆ రేంజ్లో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. తాజాగా.. టీ-హబ్‌ని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మెచ్చుకున్నారు.
ఈ వినూత్న కేంద్రం.. సాంకేతిక రంగంలో సాటిలేని ఒక అద్భుతమని అభివర్ణించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌ని ఆదిత్య ఠాక్రే మంగళవారం సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంట తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
టీ-హబ్ పక్కనే ఉన్న టీ వర్క్స్ మరియు ఇమేజ్ టవర్స్ గురించి మంత్రి కేటీఆర్.. ఆదిత్య ఠాక్రేకి వివరించారు. టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీల నిర్వహణ, ఆవిష్కరణల గురించి కూడా చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే టీ-హబ్‌ని ఏర్పాటుచేశామని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ స్టార్టప్‌లను ఎంకరేజ్ చేసేందుకు ఇలాంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయటం అభినందించాల్సిన విషయమన్నారు. ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో వెళ్లండి.. అనే స్లోగన్‌తో పని చేస్తున్న టీ-హబ్.. స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, ఇంకుబేటర్స్, యాక్సెలరేటర్స్కి కమ్యూనిటీ స్పేస్లాగ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
టీ-హబ్ బిగ్ సక్సెస్ కావటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో టీ-హబ్2 బిల్డింగ్‌ని కూడా ప్రారంభించింది. ఇన్స్పైర్.. బిల్డ్.. కొలాబరేట్.. అనే మూడు సూత్రాలను టి-హబ్ త్రికరణ శుద్ధిగా పాటిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఏడాది తర్వాత 2015లో టీ-హబ్‌ను స్థాపించారు.
ఇది ఈ ఎనిమిదేళ్లలో 2 వేలకు పైగా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్టార్టప్‌లకు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించింది. సూపర్ టెక్నాలజీ, ట్యాలెంట్, మెంటార్స్, కస్టమర్స్, కార్పొరేట్స్, ఇన్వెస్టర్స్, గవర్నమెంట్ ఏజెన్సీలు మరియు ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్టేక్ హోల్డర్స్‌తో యాక్సెస్ కల్పించింది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!