NTV Telugu Site icon

T-hub: టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది

T-hub

T-hub

T-hub: టీ-హబ్ అంటే టెక్నాలజీ హబ్. కానీ.. చాలా మంది తెలంగాణ హబ్ అనుకుంటారు. ఆ రేంజ్‌లో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. తాజాగా.. టీ-హబ్‌ని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మెచ్చుకున్నారు.

ఈ వినూత్న కేంద్రం.. సాంకేతిక రంగంలో సాటిలేని ఒక అద్భుతమని అభివర్ణించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌ని ఆదిత్య ఠాక్రే మంగళవారం సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంట తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు.

read more: Best Food @ Millet Mantra: ‘మిల్లెట్ మంత్ర’ను ‘ఆరోగ్య మంత్ర’గా అలవర్చుకోమంటున్న పూజితారెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ

టీ-హబ్ పక్కనే ఉన్న టీ వర్క్స్ మరియు ఇమేజ్ టవర్స్ గురించి మంత్రి కేటీఆర్.. ఆదిత్య ఠాక్రేకి వివరించారు. టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీల నిర్వహణ, ఆవిష్కరణల గురించి కూడా చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే టీ-హబ్‌ని ఏర్పాటుచేశామని కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ స్టార్టప్‌లను ఎంకరేజ్ చేసేందుకు ఇలాంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయటం అభినందించాల్సిన విషయమన్నారు. ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో వెళ్లండి.. అనే స్లోగన్‌తో పని చేస్తున్న టీ-హబ్.. స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, ఇంకుబేటర్స్, యాక్సెలరేటర్స్‌కి కమ్యూనిటీ స్పేస్‌లాగ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

టీ-హబ్ బిగ్ సక్సెస్ కావటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో టీ-హబ్2 బిల్డింగ్‌ని కూడా ప్రారంభించింది. ఇన్‌స్పైర్.. బిల్డ్.. కొలాబరేట్.. అనే మూడు సూత్రాలను టి-హబ్ త్రికరణ శుద్ధిగా పాటిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఏడాది తర్వాత 2015లో టీ-హబ్‌ను స్థాపించారు.

ఇది ఈ ఎనిమిదేళ్లలో 2 వేలకు పైగా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్టార్టప్‌లకు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించింది. సూపర్ టెక్నాలజీ, ట్యాలెంట్, మెంటార్స్, కస్టమర్స్, కార్పొరేట్స్, ఇన్వెస్టర్స్, గవర్నమెంట్ ఏజెన్సీలు మరియు ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్టేక్ హోల్డర్స్‌తో యాక్సెస్ కల్పించింది.

Show comments