Stock Market Analysis: ఇండియా మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కె్ట్లు నిన్న అనూహ్యంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. కానీ.. రాబోయేది పండగ సీజన్ కాబట్టి ఎఫ్‌ఎంసీజీ లాంటి రంగాల్లోని కంపెనీల స్టాక్స్ రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొడక్టుల కొనుగోళ్లు పెరగటం వల్ల ఆయా సంస్థలకు లాభాలు వస్తాయి. కాబట్టి షేర్ల సేల్స్‌కి సైతం ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది.
అందువల్ల నష్టాల నుంచి కోలుకునే సానుకూల సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీల వాటాలను ఎంతకు కొనుగోలు చేయొచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని విలువైన సలహాలు సూచనలు ఆశించేవారు ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ఇచ్చిన ఈ వారం స్టాక్ మార్కెట్ అనాలసిస్‌ని చూడొచ్చు. ఏదైనా డౌట్లు ఉన్నవారు ఆయన్ని ఫోన్‌లో గానీ ఇ-మెయిల్‌లో గానీ నేరుగా సంప్రదించొచ్చు. ‘ఎన్-బిజినెస్’ అందిస్తున్న ఈ మార్కెట్ హైలైట్స్ వీడియో కిందనే ఉంది. గమనించగలరు.