NTV Telugu Site icon

Positive News From Adani Group: అదానీ అంటే అదనే కాదు.. ఇదీనూ..

Xbn8coozvsg Hd

Xbn8coozvsg Hd

Positive News From Adani Group: గడచిన రెండు మూడు వారాలుగా అన్నీ బ్యాడ్‌ న్యూసే వస్తున్న గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల నుంచి ఇప్పుడు గుడ్‌ న్యూస్‌ కూడా వచ్చాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ డిసెంబర్‌ త్రైమాసికంలో విశేషంగా రాణించటం ఒక పాజిటివ్‌ అప్‌డేట్‌ కాగా.. అదానీ గ్రూపు కంపెనీలు లోన్లకు ప్రీపేమెంట్లు చేస్తుండటం మరో చెప్పుకోదగ్గ అంశం. అదానీ ట్రాన్స్‌మిషన్‌ సంస్థకు గతేడాది 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి ఏకంగా 78 శాతం లాభం వచ్చింది. రెగ్యులేటరీ ఆర్డర్‌ వల్ల ఒకేసారి 240 కోట్ల రూపాయల ఆదాయం రావటంతో ప్రాఫిట్స్‌ జంప్‌ అయ్యాయని అదానీ ట్రాన్స్‌మిషన్‌ పేర్కొంది.

విద్యుత్‌కి డిమాండ్‌ పెరగటంతోపాటు గుజరాత్‌లో కొత్తగా 2 ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ప్రాజెక్టులు చేస్తుండటం వల్ల సంస్థ రాబడి 22 శాతం వృద్ధి చెంది 3 వేల 552 కోట్ల రూపాయలకు చేరింది. వన్‌ టైమ్‌ ఇన్‌కం 240 కోట్ల రూపాయలను మినహాయిస్తే అదానీ ట్రాన్స్‌మిషన్‌ నికర లాభం 12 శాతం పడిపోతుందని స్పష్టం చేసింది. ఈ రెండు ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ప్రాజెక్టులను అదానీ సంస్థ 35 ఏళ్లపాటు లీజ్‌కి పొందింది. ప్రాజెక్టులు మరియు అసెట్లను కలుపుకుంటే తాము పాన్‌ ఇండియా సంస్థగా మరింత బలోపేతం అవుతున్నట్లు అదానీ ట్రాన్స్‌మిషన్‌ వివరించింది.

read more: Jewellery Prices: ఏప్రిల్‌ నుంచి ఖరీదు కానున్న ఆభరణాలు

ప్రైవేట్‌ రంగంలో అతిపెద్ద ట్రాన్స్‌మిషన్‌ & డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగా కూడా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నామని తెలిపింది. అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌లో పవర్‌కి డిమాండ్‌ పెరిగినప్పటికీ అదానీ ట్రాన్స్‌మిషన్‌ తనదైన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. విద్యుత్‌ పంపిణీ నష్టాలను పోయినేడాది ఇదే సమయంతో పోల్చితే దాదాపు ఒక శాతం తగ్గించుకోగలిగింది. విద్యుత్‌ సగటు లభ్యతను సైతం పెంచింది. 3వ త్రైమాసికంలో బొగ్గు ధర ఒక శాతం, విద్యుత్‌ కొనుగోలు ధరలు 18 శాతం పెరిగాయని, అయితే వాటి వల్ల తమపై పడ్డ భారంలో కొంత భాగాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేశామని అదానీ ట్రాన్స్‌మిషన్‌ వివరించింది.

ఇదిలాఉండగా.. అదానీ గ్రూపు.. గతంలో షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న ఒకటీ పాయింట్‌ ఒక బిలియన్‌ డాలర్ల రుణాలను ముందస్తుగానే చెల్లిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్లెడ్జ్‌డ్‌ షేర్లు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూరిటీకి రానుండగా ఏడాదిన్నర ముందే ప్రీపేమెంట్లు చేసి షేర్లను తాకట్టు నుంచి విడిపించుకుంటోంది. ఈ షేర్లు అదానీ గ్రూపులోని అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలకు సంబంధించినవి.

మార్కెట్‌లో ఇటీవల ఎదురైన ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనఖా షేర్లను ముందస్తుగా విడిపించాలని నిర్ణయించినట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. తాజా చర్యలతో గ్రూపు కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచాలని అదానీ భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనఖా షేర్లను తగ్గించుకోవటానికి ప్రమోటర్లు కట్టుబడి ఉన్నారని చెప్పటానికి ఇదొక నిదర్శనమని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ప్రీపేమెంట్‌ వల్ల ప్రమోటర్స్‌ హోల్డింగ్‌లో ఉన్న 12 శాతం అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ షేర్లు రిలీజ్‌ అవుతాయి.

వీటితోపాటు ప్రమోటర్స్‌ హోల్డింగ్‌లో ఉన్న 3 శాతం అదానీ గ్రీన్‌ షేర్లు మరియు 1 పాయింట్‌ 4 శాతం అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు విడుదలవుతాయి. మొత్తమ్మీద చూస్తే.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వల్ల అదానీ గ్రూప్‌ మీద ప్రజల్లో మరియు ఇన్వెస్టర్లలో లేనిపోయి భయాలు నెలకొన్నాయి. ఈ గ్రూపు కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న తమ సంపద ఆవిరైనట్లేనని జనం ఆందోళన చెందారు. అయితే.. అదానీ ట్రాన్స్‌మిషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో మంచి పనితీరు కనబరచటం, అదానీ గ్రూపు కంపెనీలు రుణాలకు ముందస్తు చెల్లింపులు చేయటం ద్వారా డ్యామేజ్‌ అయిన ఇమేజ్‌ని కాపాడుకోగలిగిందనే ప్రశంసలు వస్తున్నాయి.