Freedom: ఒక్కో ఇంటిలో ఒక్కో నూనె వాడుతుంటారు. వినియోగదారులు.. వంటను బట్టి నూనెను మారుస్తుంటారు. ఏడాది పొడవునా ఒకే వంట నూనె వాడటం బెటరా? (లేక) వంట నూనెను తరచూ మారుస్తూ ఉండటం బెటరా? అనేది కస్టమర్ల టేస్టును బట్టి, బడ్జెట్‌ను బట్టి ఉంటుంది.
వంట నూనెల్లో పలు రకాలు ఉన్నాయి. శనగ నూనె, పొద్దు తిరుగుడు పువ్వు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కోకోనట్
ఆయిల్, నువ్వుల నూనె.. ఇలా. వీటన్నింటిలో సన్ ఫ్లవర్ ఆయిల్‌నే ఎక్కువ మంది వాడుతున్నారని ‘‘జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా’’ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
సౌతిండియాలోని ప్రతి ఐదు ఇళ్లలో నాలుగు ఇళ్లు సన్ ఫ్లవర్ ఆయిల్‌నే వినియోగిస్తున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఎన్టీవీ బిజినెస్ ఛానల్ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వీడియో మీ కోసం..