NTV Telugu Site icon

Demand for Hotel Rooms: జర్నీలు పెరగనుండటంతో రూములకు గిరాకీ

V5xday Ebhy Hd

V5xday Ebhy Hd

Demand for Hotel rooms: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి 2 నెలల్లో దేశంలోని హోటల్‌ రూములకు భారీ గిరాకీ నెలకొంటుందని యజమానులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు, కార్పొరేట్‌ ప్రయాణాలు ఎక్కువ జరగనుండటంతో హోటళ్లకు డిమాండ్‌ పెరగనుందని ఆశిస్తున్నారు. ఈ సంవత్సరంలోని జనవరి నెలలో లీజర్‌ మరియు కార్పొరేట్‌ ట్రావెల్స్‌ గణనీయంగా వృద్ధి చెందాయి.

మేజర్‌ మెట్రో సిటీల్లో మరియు టియర్‌-2, టియర్‌-3 మార్కెట్లలో కార్పొరేట్‌ ప్రయాణాలు పీక్‌ స్టేజ్‌లో జరుగుతున్నాయి. ఫార్మా, ఆటోమోటివ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ మరియు ఐటీ సెక్టార్ల నుంచి అధిక గిరాకీ వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో.. ‘‘హోటల్‌.. హౌజ్‌ఫుల్‌’’ బోర్డులు దర్శనమిస్తాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.

read more: Is Shark Tank the next IPL: టీవీ ప్రోగ్రామ్‌ స్థాయి నుంచి బిజినెస్‌ లెవల్‌కి ఎదుగుతోందా?

ఓవరాల్‌గా 2023లో.. ఇండియా హాస్పిటాలిటీ ఎకోసిస్టమ్‌ పనితీరు.. సరికొత్త బెంచ్‌మార్క్‌లకు చేరుకుంటుందని పేర్కొంటున్నారు. గతేడాది జనవరి-మార్చి మధ్య కాలంతో పోల్చితే ఈ సంవత్సరం జనవరి-మార్చి మధ్య కాలంలో హోటల్‌ గదుల్లో రాత్రి బస చేసేవారి సంఖ్య ఏకంగా 200 శాతం పెరుగుతుందని లెక్కలేశారు. తద్వారా.. మన దేశ ఆతిథ్య రంగం మళ్లీ కొవిడ్‌ పూర్వపు స్థితికి చేరుకుంటుందని అనుకుంటున్నారు.

ఇండియాకి జీ20 అధ్యక్ష పదవి దక్కిన నేపథ్యంలో సంబంధిత కార్యక్రమాలతోపాటు ప్రాజెక్ట్‌ వర్క్‌ల మీద భారతదేశానికి ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు విదేశీ ప్రయాణాల పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదని హోటల్‌ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో దేశీయ ప్రయాణాల్లో మాత్రం విశేషమైన గ్రోత్‌ నెలకొంటుందని వివరిస్తున్నాయి.