Site icon NTV Telugu

Cute Kids Conversation: నవ్వులు పూయిస్తిన్న ఇద్దరు చిన్నారుల సంభాషణ

Untitled Design (4)

Untitled Design (4)

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన అమాయకమైన సంభాషణ అందరినీ ఎంతగానో నవ్విస్తోంది. వారి సహజత్వం, మధురమైన పరిహాసం చూసిన ప్రతి ఒక్కరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు కెమెరా ముందు నిలబడి ఉంటారు. ముందు వైపు ఉన్న చిన్నారి నమస్కరిస్తూ కెమెరా వైపు అమాయకంగా చూస్తూ, “పేదవాళ్లూ కామెంట్లలో మీ ప్రేమ పంపండి… ధనవంతులూ 10,000 రూపాయలు పంపండి” అని చెబుతుంది. ఇది విన్న వెంటనే వెనుక నిలబడి ఉన్న మరో చిన్నారి, “స్కానర్ అని చెప్పు” అంటూ ముందున్న చిన్నారిని సరిదిద్దుతుంది. వెంటనే ఆ అమ్మాయి, “స్కానర్‌లో 10,000 రూపాయలు పంపండి” అని చెప్పడం ప్రేక్షకులను మరింతగా నవ్విస్తుంది. ఈ అమాయక సంభాషణతో పాటు వారి హావభావాలు వీడియోను మరింత హాస్యభరితంగా మార్చాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఇది ఇప్పటివరకు చూసిన అత్యంత క్యూట్ వీడియో అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు చిన్నారుల అమాయకత్వానికి ముగ్ధులై హృదయ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు సరదాగా, “ఇప్పుడే 10,000 రూపాయలు ఇవ్వలేం గానీ, మీకు చాలా ప్రేమ మాత్రం తప్పకుండా ఇస్తాం” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి ఈ చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో అందరికీ నవ్వులు పూయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Exit mobile version