Best and Worst IPOs: గతేడాది 65 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికి అందులో సగం కన్నా తక్కువే.. అంటే.. 31 లిస్టయ్యాయి. ఇవి సగటున 32 శాతం లాభాలను ఆర్జించాయి. వీటి ద్వారా కంపెనీలు 58,346 కోట్ల రూపాయలను సమీకరించాయి. పోయినేడాది 65 ఐపీఓల ద్వారా 1.31 లక్షల కోట్ల రూపాయల ఫండ్ రైజ్ అయింది. ఈ ఏడాది లిస్టయిన 31 ఐపీఓల్లో 25 లాభాల్లో పయనించాయి. 5 ఐపీఓలు ఇష్యూ ధర కన్నా తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి.
ఒకటి మాత్రం ‘ఫ్లాట్’గా అంటే లాభాలు గానీ నష్టాలు గానీ లేకుండా కొనసాగుతోంది. అదానీ విల్మర్.. బెస్ట్ ఐపీఓగా నిలిచింది. 183 శాతం రిటర్న్స్ ఇచ్చింది. హరిఓం పైప్ ఇండస్ట్రీస్.. సెకండ్ బెస్ట్ ఐపీఓగా రాణించింది. 137 శాతం లాభాలు తెచ్చింది. 4 ఐపీఓలు 100 శాతం ప్రాఫిట్స్ పొందాయి. 18 ఐపీఓలు రెండంకెల లాభాలను నమోదు చేశాయి. చెత్త ఐపీఓల్లో ఎల్ఐసీ ఉంది. ఈ సంస్థ షేర్లు 31 శాతం డౌనయ్యాయి. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, డెలివెరీ, ఉమా ఎక్స్‌పోర్ట్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ కీస్టోన్ రియల్టర్స్.. వరస్ట్ ఐపీఓల లిస్టులో ఉన్నాయి.