Site icon NTV Telugu

విష్ణు విశాల్, జ్వాలా గుత్తా పెళ్లి ఫోటో వైరల్…!

Vishnu Vishal and Jwala Gutta Wedding Photo Goes Viral

ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. గతరెండ్రోజుల నుంచి గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి సంబరాలు ప్రారంభం కాగా… వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా పెళ్లి బట్టల్లో వధూవరులుగా మెరిసిపోతున్న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పిక్ వైరల్ అవుతోంది. ఈ పిక్ లో గుత్తా జ్వాలా స్కై బ్లూ కలర్ రెడ్ బోర్డర్ చీరతో పెళ్లి కూతురు అలంకరణతో మెరవగా… విష్ణు తెల్లటి షర్ట్, పంచ ధరించి పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. ఇక చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. కాగా విష్ణు విశాల్ 2010లో రజినీ అనే అమ్మాయిని వివాహం చేసుకుని, 2018లో ఆమెతో విడిపోయారు. జ్వాలా కూడా ఇంతకుముందు చేతన్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జ్వాలా, చేతన్ 2011లో విడిపోయారు.

Exit mobile version