ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతున్నాయి.. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు.. గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన రాధ రంగా రీ ఆర్గనైజేషన్ అధ‌్యక్షుడు గాదె బాలాజి.. అన్ని సామాజిక వర్గాల వారికి రంగా నాయకుడు.. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టుకపోవటం బాధాకరం అన్నారు.. రంగా పేరు పెట్టాలని అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకొస్తున్నారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.. రంగాకి వైఎస్ కి మధ్య మంచి స్నేహ బంధం ఉందని గుర్తుచేశారు.. ఇక, కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందే.. విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు బాలాజి.. రంగా పేరు పెట్టే వరకూ ఉద్యమం కొనసాగుతోందని ప్రకటించారు.
Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు.. ఒంగోలుకు ప్రకాశం, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు.. రాజకీయ నాయకులైన ఎన్టీఆర్, వైఎస్సార్ పేరు పెట్టారు… రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు టీబీకే అధ్యక్షుడు దాసరి రాము… అల్లూరి సీతారామరాజు పేరుతో మన్యం జిల్లా ఏర్పాటు చేసి, పల్నాడు జిల్లాకు కన్నెగంటి హనుమంతు పేరు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.. దామోదరం సంజీవయ్య, కన్నెగంటి హనుమంతు, వంగవీటి మోహన్ రంగా పేర్లు జిల్లాలకు పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన.. రంగా పేరు పెట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.