న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ న్యాయవాద దంపతుల హత్య కేసు పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. అయితే వామన్‌రావు, నాగమణి హత్యకేసులో దర్యాప్తు చేసి సేకరించిన వివరాలు కోర్టుకు సమర్పించారు పోలీసులు. 15 ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు అందాయని హైకోర్టుకు తెలిపిన పోలీసులు… 15 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 32 మంది ప్రత్యక్షసాక్షుల వాగ్మూలాలు కోర్టులో నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 4కు వాయిదా వేసింది హైకోర్టు.