NTV Telugu Site icon

Ugadi Celebrations: కేసీఆర్‌కి ఆశీర్వాదం.. పంచాంగ శ్రవణం

Kcr 2

Kcr 2

తెలంగాణలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ జనహితలో ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. వేడుకలకు మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేదపండితులు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించారు.

పంచాంగ పఠనం ప్రారంభించిన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి కొత్త సంవత్సరం ఎలా వుండబోతోంది అనేది వివరించారు. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. రైతులే రాజులు కాబోతున్నారు. 2015 నుండి ఇప్పటి వరకు వర్షాలకు రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ప్రజా ఆరోగ్యం బాగా ఉంటుంది… మాస్క్ లు అక్కర్లేదు.

వాగ్దాటి గల వ్యక్తులకు రాజయోగం కలుగుతుందన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్రం లో యజ్ఞ యాగాదులు ఎక్కువగా జరగాలి. సరిహద్దులలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం.. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం వుందన్నారు. రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయి. పార్టీలు మారే వారికి గడ్డుకాలం. విద్యా రంగం పట్టాలు ఎక్కబోతుంది… ఆన్లైన్ తరగతులు ఇక ఉండవు. ఇది ఉద్యోగ నామ సంవత్సరం. 75 శాతం మంచి ఫలితాలు, 25 శాతం చెడు ఫలితాలు కలుగుతాయి. ఫ్రాన్స్, రష్యాలలో అలజడి. రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాద్ లోనే బాగుంటుంది.

హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి.. మీడియాకు వార్తలకు ఇబ్బందులు లేవు. రైలు, ప్రకృతి, అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ దేశంలో జరుగుతాయి. తెలంగాణకి ఎలాంటి ప్రమాదం లేదు. నాయకులు జాగ్రత్తగా ఉండాలన్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి.