NTV Telugu Site icon

మలుపులు తిరుగుతున్న టీటీడీ ప్రధాన అర్చకుల నియామక వివాదం

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నియామకం వివాదం మలుపులు తిరుగుతుంది. రిటైర్మెంట్ అయిన ప్రధాన అర్చకులు రమణధీక్షితులు, నరశింహధీక్షితులును తిరిగి నియమిస్తూ ఏఫ్రిల్ 2వ తేదిన ఉత్తర్వులు జారి చేసింది టీటీడీ. అలాగే ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా కోనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు, గోవిందరాజ ధీక్షితులు ను ఆ పదవి నుంచి ఎందుకు తోలగించకూడదు అంటు నోటిసులు జారి చేసింది టీటీడీ. అయితే ఆ నోటిసులు పై హైకోర్టుని ఆశ్రయించారు గోల్లపల్లి వంశస్థుడు వేణుగోపాల్ దీక్షితులు, తిరుపతమ్మ వంశస్థుడు గోవిందరాజధీక్షితులు. ఇక వేణుగోపాల్ దీక్షితులు కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు… గోవిందరాజ ధీక్షితులు కేసులో స్టే మంజూరు చేసింది. దాంతో మళ్ళి మొదటికి వస్తుంది రమణధీక్షితులు, నరశింహధీక్షితులు నియామకం. చూడాలి మరి ఇంకా ఏం జరగనుంది అనేది.