NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : నేడు కింగ్స్ మధ్య యుద్ధంలో గెలుపెవరిది…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్న పంజాబ్ ను ఓడించి తనతో పాటుగా ఇంటికి తీసుకువచ్చింది చెన్నై. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొత్తం అన్ని సీజన్ లలో కేవలం ఐపీఎల్ 2020 లో మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్స్ వెళ్లకుండా పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో ముగించింది. కాన్ని ఈ ఏడాది ఆ జట్టులో మళ్ళీ రైనా రావడంతో ఆ జట్టు బలంగానే కనిపిస్తుంది. అలాగే పంజాబ్ జట్టులో కూడా వారి కెప్టెన్ రాహుల్ తో పాటుగా దీపక్ హుడా, గేల్ మంచి టచ్ లో కనిపిస్తున్నారు. ఇక  ఈరోజు మ్యాచ్ లో ఐపీఎల్ లో ముంబై తర్వాత అత్యధికంగా మూడు సార్లు టైటిల్ అందుకున్న చెన్నై జట్టు పైన ఒక్కేసారి ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన పంజాబ్ విజయం సాధించగలదా… లేదా అనేది చూడాలి.