NTV Telugu Site icon

ఎన్నికల కమిషనర్ కు గవర్నర్ సూచనలు…

కోవిడ్  కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా, అలాగే వివిధ రాజకీయ పార్టీలు  ఎన్నికలు వాయిదా వేయాలని  కోరుతున్న పరిస్థితుల  నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్  కు కాల్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని వివిధ వర్గాలు  లేవనెత్తుతున్న అంశాలపై రాష్ట్ర ఎన్నికల  కమిషనర్ తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  తాము ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా,  రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్టు కు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలతో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు  వివరించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను  మదింపు చేసి,  ఎన్నికల నిర్వహణపై  సమగ్రంగా   నివేదించాలని  ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు గవర్నర్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.