తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరి కదా, ఇంతవరకు కూడా పిఆర్సీ పై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. 1.07.2018 నుండి అమలు కావలసిన వేతనాల సవరణ ముప్పై మూడు నెలలు ఆలస్యం అయింది. మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా కనీసం పిఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు అయినా సకాలంలో వస్తాయని ఆశించిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది. పిఆర్సీ సిఫారసులు మరియు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటనలకు అనుగుణంగా వెంటనే (పిఆర్సీ) నూతన వేతనాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు(జిఓలు) వెంటనే విడుదల చేసి మే నెల నుండి నూతన వేతనాలు పొందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంటాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ పక్షాన మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతిపత్రం ఇ మెయిల్ ద్వారా అందజేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంటాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక కమిటీ సభ్యులు.
సీఎం ప్రకటనకు అనుగుణంగా పిఆర్సీ జిఓలు విడుదల : ఐక్య వేదిక
cm kcr