Site icon NTV Telugu

కోవిడ్ బాధితుల కోసం సూర్య బ్రదర్స్ కోటి విరాళం…

ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు సూర్య బ్రదర్స్. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ… పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి దశలోనూ ఎంతో మంది బాధితులకు సహాయం అందించిన సూర్య బ్రదర్స్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి అభినందించి కోవిడ్ బాధితులును ఆదుకోవాలంటూ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నికల్లో గెలిచిన స్టాలిన్ ను విశాల్ వంటి పలువురు చిత్రప్రముఖులు కలసి ప్రచారానికి వాడుకుంటుంటే… సూర్యబ్రదర్స్ మాత్రం కుటుంబంతో వెళ్లి కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ కోటి విరాళం అందజేయడం గమనార్హం. మరి సూర్య బాటలో ఎంత మంది పయనిస్తారో చూడాలి.

Exit mobile version