ఐపీఎల్ 2021 లో ఈరోజు డబల్ హెడర్ కారణంగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 2021 లో ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ ఖాతాను తెరవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ కు ఇన్ని రోజులు గాయం కారణంగా అందుబాటులో లేని కేన్ విలియమ్సన్ ఆడనున్నాడు. చూడాలి మరి ఈరోజు అయిన సన్‌రైజర్స్ దశ తిరుగుతుందా.. అనేది.
హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్
పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, హెన్రిక్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్