కేసు నమోదు అయిన తేదీ నుంచి కేవలం నాలుగున్నర నెలల అతి తక్కువ సమయంలో పొక్సో కేస్ లో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 25 వేల రూపాయల జరిమాన పడేలా చేసారు బంజారాహిల్స్ పోలీసులు… కేసు వివరాల ప్రకారం గత సంవత్సరం ఫిలింనగర్,అంబేద్కర్ నగర్ కు చెందిన ఏనెగంటి చెన్నయ్య (48) లారీ డ్రైవర్ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు .డిసెంబర్ నెలలో స్థానికంగా ఓ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు తో కేస్ నమోదు చేసిన పోలీసులు డి ఐ హఫీజుద్దీన్ ,సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్ రవిరాజ్ లు కేవలం నెలన్నర రోజులలో నే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పకడ్బందీగా షీటు నమోదు చేశారు.కాగా విచారణ చేపట్టిన నాంపల్లి మొదటి అదనపు షెషన్స్ జడ్జ్ కుంచాల సునీత నిందితుని పై పోలీసులు దాఖలు చేసిన సాక్ష్యాల తో నిందితుడిని దోషిగా ఖరారు చేశారు. కేవలం కేస్ నమోదు చేసిన నాలుగున్నర నెలల్లోనే దర్యాప్తు ,విచారణ పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు.