ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై టూర్ లో తమిళ భాషపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో రూ. 31,000 కోట్లతో పలు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తమిళ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యావిధానం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుతందని.. సాంకేతిక, వైద్య కోర్సులను స్థానిక భాషల్లో అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. దీని వల్ల తమిళ యువతకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.
తమిళ భాష శాశ్వతమైనదని..తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని మోదీ అన్నారు. చైన్నై నుంచి కెనడా వరకు, మధురై నుంచి మలేషియా వరకు, నమక్కల్ నుంచి న్యూయార్క్ వరకు, సేలం నుంచి దక్షిణాఫ్రికా వరకు తమిళ భాష ఉందని అన్నారు. పొంగల్, పుత్తండు పంగలను గుర్తు చేశారు మోదీ.
తమిళ భాష, సంస్కృతి మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాది సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ కొత్త క్యాంపస్ ను చెన్నైలో ప్రారంభించామని.. కొత్త క్యాంపస్ పూర్తిగా కేంద్రమే నిధులు సమకూరుస్తోందని వెల్లడించారు.
తమిళనాడు ప్రజలు, భాష, సంస్కృతి అత్యద్భుతమైనవని కొనియాడారు. ప్రతీ రంగంలో రాష్ట్రంల నుంచి ఎవరో ఒకరు రాణిస్తున్నారని అన్నారు. ఇటీల డెఫ్లింపిక్స్ లో 16 పతకాలు గెలిస్తే… అందులో 6 తమిళ యువకులే పతకాలు గెలిచారని అన్నారు. శ్రీలంక పరిస్థితిని చూసి మీరంతా ఆందోళన చెందుతున్నారని అనుకుంటున్నానని… శ్రీలంకను ఖచ్చితంగా ఆదుకుంటామని… ఇంధనం, ఆహారం, మందులు అందిస్తున్నామని వెల్లడించారు.