పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా కలెక్షన్ల గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా తాజాగా ‘వకీల్ సాబ్’కు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది ఫిల్మ్ సర్కిల్ లో. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ‘వకీల్ సాబ్’కు మొత్తంగా 65 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట పవన్. అందులో 50 కోట్లు ఆయన పారితోషికం కాగా… మిగతాది సినిమా బిజినెస్ లో పర్సెంటేజ్ అట. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లకు క్లోజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ తరువాత ప్రకాష్ రాజ్, తమన్, సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ లకు పారితోషికంగా నిర్మాత దిల్ రాజు భారీ మొత్తాన్ని చెల్లించారట. హీరోయిన్ నివేదా థామస్‌కు రూ .75 లక్షలు, శృతి హాసన్, అంజలిలకు రూ .50 లక్షలు పారితోషికంగా ముట్టజెప్పారట. ఇక నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ కు ఈ చిత్రం భారీ లాభాలను ఆర్జించి పెట్టిందట. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ‘వకీల్ సాబ్’ ఆడుతున్న థియేటర్లు తప్ప మిగతా థియేటర్లు మూతపడ్డాయి.
‘వకీల్ సాబ్’కు పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
