‘వకీల్ సాబ్’కు పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా కలెక్షన్ల గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా తాజాగా ‘వకీల్ సాబ్’కు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది ఫిల్మ్ సర్కిల్ లో. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ‘వకీల్ సాబ్’కు మొత్తంగా 65 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట పవన్. అందులో 50 కోట్లు ఆయన పారితోషికం కాగా… మిగతాది సినిమా బిజినెస్ లో పర్సెంటేజ్ అట. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లకు క్లోజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ తరువాత ప్రకాష్ రాజ్, తమన్, సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ లకు పారితోషికంగా నిర్మాత దిల్ రాజు భారీ మొత్తాన్ని చెల్లించారట. హీరోయిన్ నివేదా థామస్‌కు రూ .75 లక్షలు, శృతి హాసన్, అంజలిలకు రూ .50 లక్షలు పారితోషికంగా ముట్టజెప్పారట. ఇక నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ కు ఈ చిత్రం భారీ లాభాలను ఆర్జించి పెట్టిందట. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ‘వకీల్ సాబ్’ ఆడుతున్న థియేటర్లు తప్ప మిగతా థియేటర్లు మూతపడ్డాయి.
Also Read
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Tags
- pawan kalyan
- Vakeel Saab
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!