NTV Telugu Site icon

వలంటీర్లను వైసీపీ అక్రమాలకు వాడుకుంటోంది…

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతోందని ఛీఫ్ ఎలక్చ్రోల్ ఆఫీసర్ విజయానంద్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. అయితే అక్కడ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… తిరుపతి ఉప ఎన్నికలలో ఓబిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. టీడీపీ ఏజంట్లను పెట్టుకొకుండా  వీరు బెదిరింపులు చేస్తున్నారు. ఇదే అంశంపై సీఈఓ విజయానంద్ కు ఫిర్యాదు చేశాం. స్థానికేతరులను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నుంచి పంపించేయాలి. గతంలో సీసీ కెమెరాలు రాంగ్ డైరెక్షన్ లో పెట్టి అధికార వైసిపి అక్రమాలకు పాల్పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరాం. వలంటీర్లను వైసీపీ అక్రమాలకు వాడుకుంటోంది.. వలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దు అని అన్నారు.