రాష్ట్రంలో, దేశంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది అని మంత్రి కొడాలి నాని అన్నారు. కావాలంటే రాష్ట్రంలో 2 లక్షల బెడ్లు ఏర్పాటు చేయగలం? వీటికి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? కేంద్రం నుంచి తగిన కావాల్సిన స్థాయిలో ఆక్సిజన్ రావటం లేదు అని తెలిపారు. 380 టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని అడిగితే 250, 225 టన్నులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది ప్రజలను భయాందోళనకు గురి చేసి చంపాలనే పగ చంద్రబాబు, లోకేష్ లది. చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు?..దేశంలో ఏడు కోట్లకు మించి వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం ఉందా అని అడిగిన ఆయన వ్యాక్సిన్ ఏమైనా హెరిటేజ్ పాలా? పాల పొడిలో నీళ్లు కలిపి ఇవ్వడానికి అని ఎద్దెవా చేసారు. నేను డబ్బులు ఇస్తాను..20 లక్షల డోసులు చంద్రబాబు ఇప్పిస్తాడా? ఇప్పుడు ఇండెంట్ పెడితే సెప్టెంబర్ లో ఇచ్చే పరిస్థితి కంపెనీలకు లేదు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది : కొడాలి
