NTV Telugu Site icon

వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై మంత్రి ఈటల ప్రకటన…

మరికొన్ని నెలల్లో వరంగల్‌లో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 65వ డివిజన్‌ తెరాస అభ్యర్థి గగులోతు దివ్య తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.