NTV Telugu Site icon

మంట ఎలా పెట్టాలా అని టీడీపీ నేతలు చూస్తున్నారు….

ప్రతి రోజు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా పరిస్థితి పై సమీక్ష చేస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 104 కి కాల్ సెంటర్ పెట్టి… కరోనాకు సంబంధించిన సమాచారం అందేటట్లు చేస్తున్నాం అని చెప్పిన ఆయన వైద్య అధికారులు నిరంతరం కష్టపడుతున్నారు అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా వ్యవహరించాల్సిన సమయంలో చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కాగడాలు పట్టుకుని ఏ రకంగా మంట పెట్టాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. కరోనా మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మహారాజ హాస్పిటల్ లో సమస్య రాగానే కొంతమందిని ఇతర హాస్పిటళ్ళకు , కొంతమంది ని అంబులెన్స్ లోనే ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.  వెంటనే చురుగ్గా వ్యవహరించిన సిబ్బందిని అభినందించాల్సింది పోయి… బురద చల్లుతున్నారు అని పేర్కొన్నారు.