NTV Telugu Site icon

మళ్ళీ రైల్వే స్టేషన్ల వద్ద వలస కూలీల ఎదురు చూపులు…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు  నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ లిస్ట్ లో తెలంగాణ కూడా చేరిన విషయం తెలిసిందే. నిన్నటి నుండే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. దీంతో మళ్ళీ రైల్వే స్టేషన్ల వద్ద వలస కూలీల ఎదురు చూపులు కనిపిస్తున్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద వందలాది మంది వలస కూలీలు పిల్లా, పాపలతో సహా తమ రాష్టాలకు వెళ్లిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు లాక్ డౌన్ విధిస్తారో తెలియదు, ప్రస్తుతం పూట గడవటమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.