Site icon NTV Telugu

‘పక్కా కమర్షియల్’ స్క్రిప్ట్ పై మారుతి రీవర్కింగ్ ?

Maruthi Reworking on Pakka Commercial Movie Script

మాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ 29వ సినిమాగా రూపొందుతున్న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్స్ పై బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని మారుతీ చక్కగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మారుతీ ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ చిత్రం స్క్రిప్ట్ పై రీవర్కింగ్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ లో కొన్ని బెటర్మెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మారుతీ ఇటీవల ‘ప్రతిరోజు పండుగ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించాడు.

Exit mobile version