Site icon NTV Telugu

మహేష్-త్రివిక్రమ్ సినిమా: మరో ఇంట్రెస్టింగ్ గాస్సిప్

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఈ సినిమాలో మహేష్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా అండర్‌ కవర్‌ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్‌ ‘పోకిరి’, ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లో పోలీస్‌గా కనిపించారు. అయితే ఈసారి మహేష్ ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతాడో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాకి ‘పార్థు’ టైటిల్ పరిశీలనలో వుంది.

Exit mobile version