NTV Telugu Site icon

తమిళంలో ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ వీడియో

Lockdown Rap Song in Tamil from WWW Movie

కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్ సాంగ్ ని విడుదల చేశారు. తెలుగులో విడుదలైన ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

రోల్ రైడ ఈ ర్యాప్ సాంగ్ ని ఆలపించారు. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా “లాక్ డౌన్” వీడియో సాంగ్ ని తమిళంలో విడుదల చేశారు. ఈ ఎనర్జిటిక్ అండ్ క్యాచీ రాప్ సాంగ్ ని రియల్ లాక్ డౌన్ లో తమిళంలోనూ వీక్షించి ఎంజాయ్ చేయండి మరి.