NTV Telugu Site icon

మిషన్ భగీరథ లో కమీషన్ లు దండుకుంటున్నారు…

ఇదివరకు కాంగ్రేస్ హయాంలో చేసిన డెవెలప్ మెంటే ఇప్పుడు ఉంది. మేం వేసిన రోడ్లన్నీ తవ్వుతున్నారు. సిటీలో ఎక్కడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ నిధులతో కేసీఆర్ ఫామిలీ మాత్రమే డెవెలప్ అయింది అని కొండా సురేఖ అన్నారు. భగీరథ లో కమీషన్ లు దండుకుంటున్నారు. ఇన్నిరోజులు వరంగల్ ప్రజల ముఖం చూడని కేటీఆర్ ఇప్పుడేందుకు వచ్చారు. సిటీలో కొత్త పనులు ఏమీ లేవు.. పాత వాటినే ఓపెనింగ్ చేసి పోయిండు. టీఆరెస్ పాలనలో కేసిఆర్ కుటుంబం, టీఆరెస్ ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు.. ప్రజలు కాదు. టీఆరెస్ కు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎక్కడికెళ్లినా నిలదీస్తున్నారు. అందుకే మోసం చేసి గెలవాలని చూస్తున్నారు. కొండ మురళి లేకపోతే ఈస్ట్ లో ఒక్క కార్పోరేటర్ గెలిచేటోడు కాదు. పోయినసారి ఎంతో ఖర్చు పెట్టి గెలిపించినం.. ఎమ్మెల్యే నరేందర్ మోసం చేసిండు. కాంగ్రెస్ టికెట్ తో గెలిచి అమ్ముడు పోతే కన్న తల్లిని అమ్ముకున్నట్టే. పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళను కాపడుకుంటాం. ఈ ఎన్నికలే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు పునాది. కార్పోరేటర్లను గెలిపించుకోడానికి కృషి చేయాలి. ఎవరికీ టికెట్ ఇచ్చినా గెలిపించేందుకు అందరూ కృషి చేయాలి. కరోనా టైమ్ లో ఎలక్షన్ పెట్టాల్సింది కాదు.. ఓటమి భయంతో వాళ్ళ స్వార్థం కోసంఎలెక్షన్లు పెడుతున్నారు. కాంగ్రెస్ కు పునర్వైభవం తేవడానికి ఈరోజు నుంచే కృషి చేయాలి అని అన్నారు.