NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అయితే వరుసగా గత నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కోల్‌కత ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అలాగే గత మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబైని ఓడించిన ధైర్యంతో పంజాబ్ జట్టు ఉంది.  చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సహిస్తారు అనేది.

కోల్‌కత : నితీష్ రానా,గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్