NTV Telugu Site icon

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పంజాబ్ కెప్టెన్…

భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున రాహుల్ ఈరోజు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. అయితే రాహుల్ ‌  5000 పరుగులు 143 ఇన్నింగ్స్‌లలో చేయగా.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లలో ఆ మార్క్ చేరుకున్నాడు. అయితే మొత్తం క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో అందరికంటే ముందు విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 132 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్క్ చేరుకున్నాడు.