NTV Telugu Site icon

టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిష్కింద దేవస్థానం అధికారులు…

ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ నిర్ణయం వివాదం అవుతుంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాని తీవ్రంగా వ్యతిరేకించింది కిష్కింద దేవస్థానం అధికారులు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసారు కిష్కింద దేవస్థానం అధికారులు. ఆ లేఖలో టీటీడీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధికారులు.అజ్ఞానపు,మూర్ఖపు పనులు చెయ్యొదంటూ విజ్ఞప్తి చేసారు. మా లేఖకు వెంటనే సమాధానం ఇవ్వండి అని అడిగిన కిష్కింద ఆలయ అధికారులు మీ కమిటీ నివేదిక అభూతకల్పనని మేము నిరూపిస్తాం అని పేర్కొన్నారు.