NTV Telugu Site icon

ఎన్టీఆర్ తో కియారా అద్వానీ!?

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రానున్న సినిమా కావటంతో అభిమానుల్లో హడావుడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా కియారా అద్వానీ నటించబోతోందట. కొరటాల ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు కు జోడిగా కియారా నటించింది. మరోసారి కొరటాల దృష్టి ఆమెపైనే ఉందట. ఎన్టీఆర్, కొరటాల కలయికలో వచ్చిన తొలి సినిమా ‘జనతా గ్యారేజ్’లో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ 30లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. మరి కియారతో పాటు ఎన్టీఆర్ సరసన నటించబోయే ఆ రెండో హీరోయిన్ ఎవరో!?